Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News TOPS మాజీ మంత్రి హరీష్ రావుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

TOPS మాజీ మంత్రి హరీష్ రావుపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

by CVR NEWS

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో కలిసి పోలీసులను కలిసిన ఆయన, తెలంగాణలో వర్షాలు కురవకుండా, ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో హరీష్ రావు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సమాజానికి మంచిది కాదని పేర్కొంటూ, తెలంగాణ ప్రజలకు హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నమని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: