Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Latest News సిద్దిపేటలో ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్.

సిద్దిపేటలో ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్.

by CVR NEWS

సిద్దిపేట జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ హైమావతి సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ఇటీవల మల్టీపర్పస్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో కొందరు ఉపాధ్యాయులు విధుల సమయంలో పాఠశాలను విడిచి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు. అలాగే టీచింగ్ డైరీలు సక్రమంగా నిర్వహించకపోవడం, ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదులో కూడా లోపాలు ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు. ఈ వ్యవహారంపై వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని విచారణకు ఆదేశించగా, విచారణలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం నిర్ధారణ కావడంతో ఆరుగురిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: