Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News చాదర్‌ఘాట్ పోలీసుల చొరవతో 16 పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.

చాదర్‌ఘాట్ పోలీసుల చొరవతో 16 పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ.

by CVR NEWS

హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. CEIR పోర్టల్ సహాయంతో పోయిన… తప్పిపోయిన 16 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు. తమ పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ చాదర్‌ఘాట్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మలక్‌పేట్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, క్రైమ్ టీమ్ పనితీరును అభినందించారు. అనంతరం చాదర్‌ఘాట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె. బ్రహ్మ మురారి సమక్షంలో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను సంబంధిత యజమానులకు అధికారికంగా అందజేశారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: