Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద

by CVR NEWS

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం 2 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి 2 లక్షల 14 వేల 338 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.490 మీటర్లుగా నమోదైంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా, ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: