Saturday, August 8, 2026
News Navigation
Saturday, August 8, 2026
News Navigation

Breaking

Saturday, August 8, 2026
Home Latest News కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ.

కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్ భేటీ.

by CVR NEWS

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులు తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. తెలంగాణకు సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలతో కలిసి చర్చించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచే అంశంలో మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎత్తు పెరిగినా ముంపు వెయ్యి హెక్టార్లలోపే ఉంటుందని వివరించారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమై ఎత్తిపోతల వ్యయం తగ్గుతుందని సీఎం వెల్లడించారు. ఈ అంశంలో కేంద్రం సహకరించాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: