ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో ఓయూ ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న విద్యార్థులు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువత విద్య, ఉద్యోగ రంగాల్లో మరింత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివాసీ సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. విద్య, ఉపాధితో పాటు భూమి, అటవీ హక్కులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఓయూలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు.
49
previous post