49
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, టెస్టింగ్ హెల్త్ క్యాంప్ ప్రారంభమైంది. శిశిర హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్యాంప్‌ను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించిన ఎంపీ.. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన బ్రోకర్లు ప్రతిరోజూ ఎందుకు వస్తున్నారని అధికారులను, వైద్యులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నాలు జరగకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో బ్రోకర్ల సంచారంపై వైద్యులపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.