Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News భూపాలపల్లిలో డీజీపీ సీవీ ఆనంద్ క్రైమ్ రివ్యూ.

భూపాలపల్లిలో డీజీపీ సీవీ ఆనంద్ క్రైమ్ రివ్యూ.

by CVR NEWS

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రెండు జిల్లాల్లో నమోదవుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, కేసుల దర్యాప్తు పురోగతి, పోలీసుల పనితీరుపై అధికారులతో డీజీపీ చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించడంతో పాటు, నేరాల కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

( ) తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మామునూర్, భూపాలపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నక్సల్స్ ప్రభావం తగ్గిందని, పునరావాసం అందని వారి వివరాలను నోట్ చేసుకున్నామని చెప్పారు.ఆన్‌లైన్ బెట్టింగ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, పోలీసులకు కూడా బెట్టింగ్‌పై కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. సైబర్ మోసాల్లో తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 450 కోట్లను రికవరీ చేశామని, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ను మరింత పెంచుతామని స్పష్టం చేశారు డీజీపీ సీవీ ఆనంద్.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: