Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh జిల్లాలను విడదీసి తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం

జిల్లాలను విడదీసి తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం

by Rama
జిల్లాలను విడదీసి తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తాను కనుక సీఎంగా ఉండి ఉంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి ఉండేవాడనని చెప్పారు. చంద్రబాబు ఏపీకి మళ్లీ సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించాలని సూచించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు. జిల్లాలను విడదీసి తప్పు చేసిన వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు వాటి పర్యవసానమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌ను తప్పిస్తేనే తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య పరిష్కారం అవుతుందని కిరణ్‌కుమార్ చెప్పారు. ఈ ట్రిబ్యునల్‌పై తీర్పుపై తాను స్టే తీసుకొచ్చి 11 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని కిరణ్‌కుమార్‌‌రెడ్డి హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..
    మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
  • ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
  • పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
    కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
  • మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
  • అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
    అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009374
Total views : 62118

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.