Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదు

రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదు

by Satya
రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదు

రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రైల్వేలను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 400 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెయ్యి కిలోమీటర్ల వరకు సౌకర్యంగా ప్రయాణించేలా చూడడమే తమ ధ్యేయమని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రైల్వేలు పూర్తి స్థాయిలో మారిపోతాయని తెలిపారు. వందే భారత్, నమో భారత్, కవచ్ రైలు రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వంటి వాటి వల్ల అనేక మార్పులకు దారి తీస్తాయన్నారు.

రైల్వేలను ప్రయివేటీకరించే ప్రశ్నే లేదని, ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైల్వే, రక్షణ రెండు భారతదేశానికి రెండు వెన్నెముకలని కొనియాడారు. రైల్వే రాజకీయీకరణ ఆగిపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, పనితీరు, భద్రత, సాంకేతికతతో అందరికీ మంచి సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. గత పదేళ్లలో 31 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు వేశామని, ఇది ఫ్రాన్స్ నెట్‌వర్క్ కంటే ఎక్కువని తెలిపారు. రైల్వే బడ్జెట్ ప్రస్తుతం రూ.2.5 లక్షల కోట్లుగా ఉందన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి మాట్లాడుతూ వాటిని అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.35 కోట్లు కేటాయించామని, సర్వీస్ రూల్స్, ప్రమోషన్లకు సంబంధించిన పలు డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..
    విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
  • క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..
    సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
  • చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..
    దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
  • రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..
    రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014664
Total views : 80734

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.