Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh మండుటెండలో నీటి యుద్ధం…

మండుటెండలో నీటి యుద్ధం…

by Prakash
Water war


నీటి యుద్ధం (Water war) : త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కిన వెంకట నరసింహ పురం కాలనీ వాసులు…

నీటి యుద్ధం (Water war) : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ వెంకట నరసింహపురం కాలనీ వాసులు త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి నెలకొంది, గత 20 రోజుల నుండి కాలనీలో నీటి సమస్య ఉందని కేసరపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని, మొక్కుబడిగా రోజుకు ఒక ట్రాక్టర్ ట్యాంకర్ పంపిస్తున్నారు ఇంటికి రెండు బకెట్లు నీళ్లు కూడా రావడం లేదు, మండుటెండలో నీళ్ల కోసం నాన్న ఇబ్బందులు పడుతున్నామని వెంకట నరసింహాపురం కాలనీవాసులు రోడ్లపైకి వచ్చి కేసరపల్లి సర్పంచ్ కార్యదర్శి ఇప్పటికైనా తమ గోడు విని తమకు త్రాగునీరు అందించాలని వేడుకుంటున్నారు.

ఇది చదవండి : కొవ్వూరు లో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు

కాలనీ వాసులు మాట్లాడుతూ….

నిత్యవసరమైన నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో రాత్రి సమయంలో అరగంట మాత్రమే పంచాయతీ నీటి కుళాయిల ద్వారా ఒకప్పుడు వచ్చాయి, ఇప్పుడు అవి కూడా రావడం లేదు. పంచాయతీ నీళ్లు కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్రలు మానుకుని ఎదురుచూపులు చూస్తున్నాము. మండుటెండల సైతం లెక్కచేయకుండా జనాలు నీళ్ల కోసం రోడ్ల వెంబడి తిరగవలసిన పరిస్థితి నెలకొంది. గత 20 రోజులుగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కి చెప్పిన నీటి సమస్య తీర్చకుండా నిర్లక్ష్య వైఖరి గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డ్రమ్ము నీరు 25 రూపాయలు చెల్లించి బయట నుంచి కొనుక్కుని దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాయకులు అధికారులు స్పందించి మా నీటి దాహార్తిని తీర్చాలని కేసరపల్లి శివారు వెంకట నరసింహ పురం కాలనీవాసులు వేడుకుంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


  • అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.
    అనకాపల్లి జిల్లా పరవాడలో భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 490 కేసుల్లో పట్టుబడిన 20 వేల 876 కిలోల గంజాయి, 23 కిలోల హాశిష్ ఆయిల్‌ను కోస్టల్ వేస్ట్…
  • మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.
    ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మ‌లేషియా చేరుకున్న మంత్రి నారాయ‌ణ కు ఘన స్వాగతం లభించింది.కౌలాలంపూర్ లోని భార‌త హైక‌మిష‌న్ కార్యాల‌యంలో మంత్రికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మంత్రి నారాయ‌ణ‌తో క్లాంగ్ ఎంపీ గ‌ణ‌ప‌తిరావు,మంత్రి…

  • CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మండుటెండలో నీటి యుద్ధం…
    Advertisements

    You may also like

    Our Visitor

    025716
    Total views : 148071

    Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.