సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి భార్యభర్తలిద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల వయసు గల ఒక పాప శ్రీహా, శ్రీ హాన్స్ కవలపిల్లలు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరగడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి శ్వేత నిన్న రాత్రి స్కూటీపై అమీన్ పూర్ పెద్ద చెరువుకు వచ్చారు. తన పిల్లలతో కలిసి ఒక్కసారిగా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్ గుర్తించి తల్లి, పాపను ప్రాణాలతో బయటకు తీశారు. చెరువులో మునిగిపోయిన బాబు శ్రీహన్స్ కోసం గాలించగా ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
- వైభవంగా గోదావరి పుష్కరాలు.గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.