Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Telangana తెలంగాణలో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల..

తెలంగాణలో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల..

by Satya
Janasena party

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. జనసేనకు బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుండి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుండి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్ రావు, వైరా నుండి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట నుండి ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: