Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే – ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది

సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే – ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది

by Satya
BRS and BJP

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు. హంగ్‌కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు. 2018లోనూ ఇలాగే చేశారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా.. ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత సానుభూతి తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147112

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.