Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలి – రేవంత్ రెడ్డి

పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలి – రేవంత్ రెడ్డి

by Satya
Revanth Reddy

రాష్ట్రంలో పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సెలక్షన్ ప్రక్రియలో ఉన్న లోపాలు, పరిష్కారాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన రిక్రూట్‌మెంట్లపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరిగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఎనిమిదేళ్లుగా హోంగార్డు నియామకాలు లేవని పేర్కొన్న సీఎం, వెంటనే నియామకాలు చేపట్టాలని కూడా ఆదేశించారు. హోం గార్డు సేవలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించాలని కూడా సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

026198
Total views : 150028

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.