Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Devotional జగన్నాథ ఆలయంలో ఘనంగా స్వామి సుదర్శన హోమం…

జగన్నాథ ఆలయంలో ఘనంగా స్వామి సుదర్శన హోమం…

by Prakash
Lakshmi Narasimha Swami Sudarshan Homa

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ ఆలయంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన హోమం నిర్వహించారు. ఈ ఆలయానికి 600 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. భారత దేశంలో జగన్నాథ ఆలయం రెండవ “పూరి” జగన్నాథ ఆలయంగా పేరుగాంచింది. సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామి వారికి వేదమంత్రోచ్ఛరణల మధ్య, భాజా భజంత్రీలతో లక్ష్మీ నరసింహ స్వామి హోమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది. భక్తులు ఈ హోమానికి అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: