Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ఏఐసీసీ ప్రకటన విడుదల…

ఏఐసీసీ ప్రకటన విడుదల…

by Prakash
YS Sharmila as the President of Andhra Pradesh Congress Party

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్‌లో చేరిన 15 రోజుల్లోనే ఏపీకాంగ్రెస్‌ పగ్గాలు షర్మిలకు దక్కాయి. తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు వైఎస్‌ షర్మిలకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా షర్మిల ప్రభావం అధికార, విపక్ష పార్టీలపై పడే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014197
Total views : 79537

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.