Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra PradeshKarnool కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎవరకి?

కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎవరకి?

by Rama
MLA Ticket

రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి సిఎంవో నుంచి పిలుపు రావడంతో అమరావతి వెళ్ళారు. అయితే ఈ సారి మళ్ళీ కర్నూలు ఎమ్మెల్యే టికెట్ హఫీజ్ ఖాన్‌కే ఇస్తారనే ప్రచారం జరుగుతుండటంతో కర్నూలు నగర శివార్లలో ఓ ప్రైవేట్ హోటల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు. కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తిరిగి హఫీజ్ ఖాన్‌కే కేటాయిస్తే సహకరించేది లేదని ఎస్వీ వర్గీయులు స్పష్టం చేశారు. ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత 5సంవత్సరాల్లో స్వంత పార్టీలోనే అనేక ఇబ్బందులు పడి కేసులను ఎదుర్కొన్నామని.. ఇపుడు మరో సారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ సారి కచ్చితంగా కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే ఇవ్వాలని ఎస్వీ వర్గీయులు పట్టుబడుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య కొద్ది కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇపుడు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే కేటాయించాలని ఎస్వీ వర్గీయులు డిమాండ్ చేస్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: