Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేసిన పవన్ కళ్యాణ్

పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేసిన పవన్ కళ్యాణ్

by Rama
Pavan kalyan

పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికీ, వెంకయ్య నాయుడు గారికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు, భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు . తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం. వాదరికీ నా అభినందనలు.

Advertisements

You may also like

Our Visitor

039487
Total views : 197118

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: