122
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మలకు తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులో హలాల్(Halal) చేయొద్దని, ఆదివాసి సంప్రదాయాలను కాపాడాలని ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కోరారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆదివాసి సంప్రదాయాలను గౌరవిస్తూ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని తల్లుల సేవలో తరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా హలాల్ చేసేందుకు ప్రయత్నించేవారు జాతరకు రావద్దని పేర్కొన్నారు. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను తప్పకుండా గౌరవించాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.