ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh):
ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం అప్పులేని రాష్ట్రంగా, రౌడియిజం లేని రాష్ట్రంగా, డ్రగ్స్ గంజాయి లేని రాష్ట్రంగా ఉండాలని జైభారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుందని ఆపార్టీ అధ్యక్షుడు మాజీ జేడి లక్ష్మినారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉందని కొద్దిగా కొన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా రాష్ట్రం టూరీజంలో ఎంత ముందుకు వెలుతుందో చూడండంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. టూరిస్ట్ ఎప్పుడు కూడ ఎలా అలోచిస్తాడంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని చూస్తాడు. కాని మన రాష్ట్రంలో ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకోవడం చూస్తుంటే టూరిస్ట్ ఎప్పుడు కూడ ఆ రాష్ట్రానికి వెళ్లెందుకు ఇష్టపడడన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంటే టూరిస్ట్ కూడ ప్రశాంతంగా ఉంటాడని అన్నారు. అంతే కాకుండా మద్యపానం నిషేధం అన్నారు.
కాని మన రాష్ట్రంలో ఉన్నంత మద్యం రేట్లు ఏ రాష్ట్రంలో లేదన్నారు. ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్ జరుగుతుంటే మన రాష్ట్రంలో మద్యానికి కూడ క్యాస్ పేమెంట్ జరుగుతుందని క్యాస్ పెమెంట్ వల్ల అవినీతి పెరుగుతుందన్నారు. అవినితి లేని ఆంద్రప్రదేశ్ గా ఉండాలని జైభారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి లేని రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని శ్రీశైలం మండలంలోని సున్నిపెంటలో విలేకరుల సమావేశంలో అన్నారు. అనంతరం జైభారత్ నేషనల్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్తగా సికిందర్ బాషాను నియమించామని వెల్లడించారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.