మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేగింది. ఒక్క పుణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉన్నారు. పుణేలో మొదట ఓ డాక్టర్ కు, ఆయన టీనేజి కుమార్తెకు జికా వైరస్ పాజిటివ్ గా తేలింది. తాజాగా, ఆ డాక్టర్ కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలోనే రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఇద్దరి శాంపిల్స్ ను పరీక్షించగా, జికా వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, ఇరంద్ వాణే ప్రాంతంలో ఆరోగ్య శాఖ విస్తృతస్థాయిలో శాంపిల్స్ సేకరిస్తోంది.
గర్భవతులకు జికా వైరస్ సోకితే, పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పుట్టే శిశువుపై ఈ వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తుందని, సాధారణం కంటే చాలా చిన్న తలతో శిశువులు జన్మిస్తుంటారని వివరించారు. శిశువుల్లో పుట్టుకతోనే వచ్చే ఇతర అసాధారణ ఆరోగ్య సమస్యలను కూడా ఈ వైరస్ కలిగిస్తుందని తెలిపారు. జికా వైరస్ అనేది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ అల్బోపిక్టస్ అనే రకాల దోమలు జికా వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. జికా వైరస్ ను 1952లో మొట్టమొదటిసారిగా ఉగాండాలో గుర్తించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…
- ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
- పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
- నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
- పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212402