Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత

హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత

by Rama
హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె  వైఎస్ సునీత

వైఎస్ వివేకా కుమార్తె సునీత ఏపీ సచివాలయానికి వెళ్లారు. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్ చాంబర్‌లో అనితతో సమావేశమయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత. సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..
    సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్‌తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
  • చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..
    దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
  • రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..
    రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
  • అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
    అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014654
Total views : 80701

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.