తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపారు. ములుగులో సమ్మక్క-సారలమ్మ వర్సిటికి తక్కువ ధరకే భూములు కేటాయించాలని నిర్ణయించారు. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ఆమోదించారు. రేరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు కేబినెట్ భేటీలో మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెట్రో రైల్ మార్గాల విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నాగోల్ నుంచి LB నగర్, LB నగర్ నుంచి హయత్ నగర్, LB నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయింది. దీంతో పాటు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141542