విద్వేషపూరిత చర్యలు, నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ‘కాంబాటింగ్ హేట్ బిల్లుకు కెనడా చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లుకు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర వేయగా, అనంతరం దీనిని ఎగువసభ కు పంపించారు. విద్వేష చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇది అమల్లోకి వస్తే ప్రార్థనా స్థలాలపై దాడులు, ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకుల అంచనా. ఈ చట్టం కోసం కెనడా లోని భారత సంతతి వ్యక్తులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నారు.
కెనడాలో ఖలిస్థానీల ఆగడాలు ఇటీవల పెరిగిపోయాయి. కొన్ని వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం, విధ్వంసం సృష్టించడం.. తదితర ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా ఘటనలపై ప్రవాస భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే విద్వేష చర్యలకు సంబంధించి కొత్త బిల్లు ఆమోదం పొందడం ఊరట కలిగించే విషయం.
నిషేధిత సంస్థల చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించడం, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలను కొత్త బిల్లు ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. యూదులు, ముస్లింలు, ఇతర మతాల వారిని ఆయా ప్రార్థనా స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా నేరమే. ఇటువంటి చర్యలకు పాల్పడేవారికి గరిష్ఠంగా పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, కన్జర్వేటివ్‌లు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.
‘కాంబాటింగ్ హేట్’ బిల్లుకు కెనడా చట్టసభ ఆమోదం…
100
previous post






Total views : 78774