Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Telangana సికింద్రాబాద్ లో 10న మోదీ ‘జనాగ్రహ సభ’..

సికింద్రాబాద్ లో 10న మోదీ ‘జనాగ్రహ సభ’..

by CVR NEWS
సికింద్రాబాద్ లో 10న మోదీ 'జనాగ్రహ సభ'

తెలంగాణ గడ్డపై మరోసారి మోదీ మార్క్ రాజకీయం మొదలుకాబోతోంది. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఏర్పాట్లను ప్రారంభించారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… మోదీ తొలిసారి తెలంగాణకు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని రాంచందర్ రావు తెలిపారు. భవిష్యత్తులో దక్షిణాది అంతటా కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: