Thursday, May 21, 2026
News Navigation
Thursday, May 21, 2026
News Navigation

Breaking

Thursday, May 21, 2026
Home Devotional కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

by CVR NEWS
కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది. ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, విభిన్న కళా సాంస్కృతిక కార్యక్రమాలు, మనోహరమైన పాటకచేరీలతో కుప్పం వీధులన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా, పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుప్పానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సైతం జాతర జరిగే ఎనిమిది రోజుల పాటు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కుప్పం స్టేషన్‌లో నిలపాలని నిర్ణయించింది. ఇక జాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ఇవాళ గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శన మహోత్సవం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించనున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

015181
Total views : 81759

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.