Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Crime సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

by CVR NEWS
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత

గంజాయి తరలిస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ,ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పద్దెనిమది లక్షలకు పైగా విలువైన 36 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్, బీహార్ కు చెందిన సుమన్ కుమార్ గా గుర్తించారు. సుధాంశు పుణెలోని బార్క్లేస్ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా ఇంజినీర్ గా పనిచేస్తుండగా, సుమన్ కిరాణా దుకాణం నడుపుకుంటున్నాడు.. ఒడిశా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తుంటారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019200
Total views : 90087

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.