307
ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వెంకటాపురం మండలానికి ఆనుకుని ఉన్న కర్రెగుట్టల్లో ఓ చెట్టు మొదటి నుంచి వెదురు బొంగు ద్వారా ఏడాది పొడవునా స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తోంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుండగా, అడవి జంతువులు, గతంలో మావోయిస్టులు కూడా ఈ నీటినే ఆధారంగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.