Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.

రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.

by CVR NEWS
రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గేటు బయటే నిలిచిపోయారు.గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “మన ఊరు–మన బడి” కార్యక్రమం కింద రెండేళ్ల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 40 లక్షల రూపాయల విలువైన టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ రామనాథం కొత్త తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు.అయితే మొత్తం బిల్లుల్లో ఇప్పటివరకు కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని, ఇంకా 33 లక్షల రూపాయలు బకాయిగా ఉన్నాయని కాంట్రాక్టర్ ఆరోపించారు. బిల్లుల కోసం పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పనుల నిర్వహణ కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని, అప్పుదారుల ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోందని వాపోయారు. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరి మార్గంగా పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.పాఠశాల ప్రారంభమైన తొలి రోజే విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: