Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home International రష్యాకు చెందిన బాంబర్ విమానానికి ప్రమాదం.

రష్యాకు చెందిన బాంబర్ విమానానికి ప్రమాదం.

by CVR NEWS
రష్యాకు చెందిన బాంబర్ విమానానికి ప్రమాదం

రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్ విమానం సైబీరియాలో కుప్పకూలింది. ఒక శిక్షణ విమానానికి ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదాన్ని ముందే గమనించిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. బ్యాక్‌ఫైర్ అని పిలవబడే Tu-22 విమానం, సోవియట్ కాలం నాటి సూపర్ సోనిక్ బాంబర్. రష్యా దీనిని సిరియా, ఉక్రెయిన్‌లలో సైనిక చర్యల కోసం ఉపయోగిస్తోంది. ఇది హైపర్‌సోనిక్ కింజాల్ క్షిపణులను మోసుకెళ్లగలదు. అంగారా నది ఒడ్డుకు సమీపంలోని, కామెంకా గ్రామం వద్ద ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. విమానం ఎటువంటి యుద్ధ సామాగ్రి లేకుండా ప్రయాణిస్తుండటం వల్ల పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు. ప్రాణాపాయం నుండి తప్పించుకున్న నలుగురు సభ్యులను ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని స్థానిక గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజన్ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: