Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Crime సంచలనం రేపిన ఐఎస్ సదన్ పరిధిలోని నగదు చోరీ ఘటన.

సంచలనం రేపిన ఐఎస్ సదన్ పరిధిలోని నగదు చోరీ ఘటన.

by CVR NEWS
సంచలనం రేపిన ఐఎస్ సదన్ పరిధిలోని నగదు చోరీ ఘటన

హైదరాబాద్ నగరంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు చోరీ ఘటన సంచలనం రేపింది .రీన్‌బజార్–సంతోష్‌నగర్ ప్రధాన రహదారిపై ఏటీఎంలకు నగదు తరలిస్తున్న క్యాష్ వాహన డ్రైవర్ రూ.17 లక్షల నగదుతో పరారైయ్యాడు . పక్కా ప్రణాళికతో నగదు అపహరించిన నిందితుడు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు కొనసాగుతుండగా , కొన్ని ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం వెతుకుతున్నాయి. నగదు రవాణా భద్రతపై అధికారులు సమీక్ష ప్రారంభించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: