Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు కల్పించాలి- మీనాక్షి నటరాజన్.

ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు కల్పించాలి- మీనాక్షి నటరాజన్.

by CVR NEWS
ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు కల్పించాలి- మీనాక్షి నటరాజన్

సర్ పేరుతో బిజెపి పార్టీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. తన నామినేషన్ తిరస్కరణకు కూడా కారణం ఇదేనని ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్లో 30 లక్షల ఓట్లను తొలగించిందని, మమతా బెనర్జీ ఓటమికి కారణం బీజేపీ యేనని, 2028 లో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి పక్క ప్లాన్ తో సర్ ను అడ్డం పెట్టుకొంటుందని మీనాక్షి నటరాజన్ విమర్శించారు.
2002లో బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎస్ ఐ ఆర్ ఉపయోగించారని అన్నారు. దానివల్ల ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇది మన అందరి ఈ దేశం మన అందరిదీ ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకునేలా చేయాలని సూచించారు.

SIR లో మనం యాక్టివ్ గా పాల్గొనాలని, ఎన్నిసార్లు ఓట్లు వేసినా తిరిగి నమోదు చేసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కీలకమైన ధృవీకరణ పత్రాలు సిద్దం చేసుకుని సమర్పించకుంటే ఓట్లు గల్లంతు అవుతాయని, ప్రతి ఓటరు తన ఓటును కాపాడుకునేలా బిఎల్ఎ లు సహకరించాలని పిలుపునిచ్చారు. ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నెల రోజుల పాటు బిఎల్ఎ లకు సహకరించాలని దామోదర రాజనర్సింహ సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: