Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News మహబూబ్‌నగర్ జిల్లాలో ATC కి మంత్రి వివేక్ శంకుస్థాపన.

మహబూబ్‌నగర్ జిల్లాలో ATC కి మంత్రి వివేక్ శంకుస్థాపన.

by CVR NEWS
మహబూబ్‌నగర్ జిల్లాలో ATC కి మంత్రి వివేక్ శంకుస్థాపన

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో 42 కోట్లతో ఏర్పాటు చేయనున్న ATC కి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని 65 ఐటీఐలు నిధులు లేక నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఏటీసీలను అభివృద్ధి చేస్తోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ లభించి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. .2 వేల 200 కోట్ల నిధులతో టాటా వారి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గత పాలకులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి కీలక అంశాలను విస్మరించారని ఆరోపించారు. యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: