Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త ఏటీసీ భవనం.

గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త ఏటీసీ భవనం.

by CVR NEWS
గన్నవరం ఎయిర్‌పోర్టులో కొత్త ఏటీసీ భవనం

కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. 77 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సముదాయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అంతకుముందు ఏటీసీ ఆవరణలో మొక్కలు నాటారు.విజయవాడ ఎయిర్‌పోర్టులో 77 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఏటీసీ భవనాన్ని నిర్మించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ విమానాశ్రయాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. టెర్మినల్ భవనం, ఏవియేషన్ రంగ అభివృద్ధిలో భాగంగా ఏటీసీ భవనం కీలకమని పేర్కొన్నారు.ఫ్లైట్ల రాకపోకలు, సిగ్నల్స్ నిర్వహణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. గతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల నుంచే కార్యకలాపాలు సాగేవని.. విమానాల సంఖ్య, రద్దీ పెరగడంతో కొత్త భవనం అవసరమైందన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టును రాజధాని ప్రాంతానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని.. రాబోయే మూడు నెలల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: