రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా రాయలసీమ వైసిపి నేతల బృందం నంద్యాల జిల్లా లోని అవుకు, గోరుకల్లు రిజర్వాయర్లతో పాటు జిఎన్ఎస్ఎస్ కెనాల్, అవుకు టెన్నల్ లను పరిశీలించింది. నంద్యాల ,అనంతపురం జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేల తో కూడిన వైసీపీ నేతల బృందం ఈ పర్యటనలో పాల్గొన్నారు. గోరుకల్లు ,అవుకు రిజర్వాయర్ లలో పూర్తిస్థాయి నీటి నిల్వ చేయలేని పరిస్థితిలో ప్రాజెక్టు లు అధ్వాన్నంగా మారాయని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం రిజర్వాయర్ లో తెలంగాణ వాళ్లు డెడ్ స్టోరేజ్ వరకు నీళ్లు తోడేస్తున్న ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ధ్వజమెత్తరు. తెలంగాణ వాళ్లు లిఫ్ట్ ద్వారా నీళ్లు తరలిస్తు ఉండటంతో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెచ్చారని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అన్ని పూర్తి చేసి విద్యుత్ మోటార్ లు అమర్చే సమయంలో టిడిపి అధికారంలోకి రావడం సీమ ప్రజల దురదృష్టమని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమ ప్రాజెక్టులను పరిశీలించిన వైసీపీ నేతల టీం.
212
previous post