Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Andhra Pradesh గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు.

గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు.

by CVR NEWS

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ చెరువులో అక్రమ ఇసుక తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారాయి. విచ్చలవిడిగా ఇసుక తవ్వడంతో చెట్ల వేర్ల వ్యవస్థ దెబ్బతిని పెద్ద ఎత్తున నీలగిరి చెట్లు నేలకూలుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కిపైగా చెట్లు వేర్లు బయటపడి ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రతిరోజూ యంత్రాలతో ఇసుకను తవ్వి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో వైరల్ అయిన వీడియోలపై కూడా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మడకశిర గ్రామీణ సీఐ రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: