Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్.

by CVR NEWS

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో రైతులకు సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్. ఖానాపూర్ మండలం మేడంపల్లి శివారులోని సదర్మాట్ ఆనకట్ట నుంచి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. సదర్మాట్ కెనాల్ ద్వారా ఖానాపూర్, కడెం మండలాల్లోని 13 వేల 120 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కడెం ప్రాజెక్టు వద్ద మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని రైతుల సాగుకు విడుదల చేశారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో కొంత ఆలస్యంగా నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు నిండుకుండలా ఉందని.. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సాగునీటి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మండిపడ్డారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: