Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra Pradesh పులివెందులలో విద్యార్థులను ర్యాలీకి తరలించడంపై బీటెక్ రవి ఆగ్రహం.

పులివెందులలో విద్యార్థులను ర్యాలీకి తరలించడంపై బీటెక్ రవి ఆగ్రహం.

by CVR NEWS

కడప జిల్లా పులివెందులలో రాజకీయ ర్యాలీలకు విద్యార్థులను తరలించడంపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలోని ఓ ప్రైవేట్ కళాశాల వద్దకు చేరుకున్న ఆయన.. నిన్న జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీకి కాలేజీ విద్యార్థులను తీసుకెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని బీటెక్ రవి ఆరోపించారు. ఎంపీ పిల్లలు హైదరాబాద్‌లో చదువుకోవాలా.. ఇక్కడి విద్యార్థులను మాత్రం రాజకీయ ర్యాలీలకు తీసుకెళ్లాలా అంటూ ప్రశ్నించారు.
ర్యాలీకి జన బలం లేకపోతే తమను అడిగితే ప్రజలను పంపిస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లాలని ఒత్తిడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో డీఎస్సీకి అనుకూలంగా రాజకీయ కార్యకర్తలను కాకుండా ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించాలని బీటెక్ రవి సూచించారు. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: