Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Crime మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.

మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.

by CVR NEWS

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్‌ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు 36 మంది ఉండగా.. గుంటూరుకు చెందిన ముగ్గురు.. శరణప్ప, లక్ష్మీదుర్గ, మహేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారిలో 20 మందికి పైగా గాయపడ్డారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. గాయపడినవారిని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి విషమంగా ఉన్న ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రమాద ఘటనలో ట్రాఫిక్‌ స్తంభించడంతో అక్కడే ఉన్న పెట్రోల్‌ బంకులోంచి వాహనాలను దారి మళ్లించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: