పేద రెడ్ల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్‌ను వెంటనే పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి పాలకవర్గాన్ని నియమించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పం గారి రామ్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013 నుంచి నిరుపేద రెడ్ల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించినా.. ప్రభుత్వాల హామీలు అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై కేబినెట్‌లో తీర్మానం చేసినప్పటికీ.. ఇప్పటివరకు పాలకవర్గాన్ని నియమించకపోవడం, నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాలు, వైద్య విద్యలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. పేద రెడ్ల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
సెప్టెంబర్ 8న ఇందిరాపార్క్ వద్ద మహా నిరసన దీక్ష.
55
previous post