Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health క్యాన్సర్‌ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారం మీకోసమే

క్యాన్సర్‌ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహారం మీకోసమే

by Satya
Cancer

క్యాన్సర్ ఈ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని భయంగా ఉంటుంది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మరణాల్లో క్యాన్సర్‌‌‌‌‌ రెండవ ప్రధాన కారణం. ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఎవరకైనా, ఏ వయసు వారికైనా క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉంది. క్యాన్సర్ కారణంగా ప్రతి ఏటా మిలియన్ల మంది మరణిస్తున్నారు. కొన్ని రకాల క్యాన్సర్లను మనం నిరోధించలేం. జీవనశైలి కారణంగా వచ్చే క్యాన్సర్ల ముప్పును కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. మన డైట్‌లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం మన ఆరోగ్యాన్ని రక్షంచడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవడానికి మన డైట్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో చూద్దాం. నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు, బత్తాయి, కమల వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కారక పదార్థాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సిట్రస్‌ పండ్లను మీ డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవచ్చు. పాలకూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకు కూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్‌, బ్లాక్బెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. బెర్రీస్‌ సెల్‌ డ్యామేజ్‌ను నివారిస్తాయి, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి, క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. రోజూ మీ ఆహారంలో బెర్రీస్‌ కచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. టొమాటోలు లైకోపీన్‌తో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్స్‌ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. ఇవి ప్రోస్టేట్‌, , ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. టొమాటోలను వండడం, ప్రాసెస్ చేయడం వల్ల లైకోపీన్ యొక్క జీవ లభ్యత పెరుగుతుంది. గ్రీన్ టీలో పాలీఫెనాల్స్‌ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. బ్రెస్ట్‌, ప్రోస్టేట్‌, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, కొలొరెక్టల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

Advertisements

You may also like

Our Visitor

025853
Total views : 149297

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.