Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh మహిళను హత్య చేసిన కేసులో నిందితుల అరెస్ట్…

మహిళను హత్య చేసిన కేసులో నిందితుల అరెస్ట్…

by Prakash
Arrest in the case of the accused

బంగారం కోసం మహిళను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్య చేసి, ఆ తర్వాత ఆనవాళ్లు కనపడకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నారాజపాలెం దిన్నె గ్రామానికి చెందిన భయ్యారాణి అనే మహిళ వద్ద బంగారం దోచుకుని, ఆ తర్వాత హత్య చేసి తగులపెట్టినకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మృతురాలి వద్ద నుంటి దోచుకున్న 155 గ్రాముల బంగారు నగలును స్వాధీనం చేసుకున్నట్లు వీరాంజనేయులు తెలిపారు. దగదర్తి మండలం ఊచగుంట పాలెంకు చెందిన అనుష్, ఆత్మకూరు మండలానికి చెందిన పాశం వెంకటేష్, బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన గిరీష్ ను నేరస్తులుగా పరిగణించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వీరాంజనేయులు తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డులు అందజేశామని డీఎస్పీ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025935
Total views : 149529

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.