Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Crime బి ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య…

బి ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య…

by Prakash
suicide

సంగారెడ్డి జిల్లా సదాశివ పేట పట్టణం లో బి ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని శివాని 17, ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివపేట పట్టణములో చోటుచేసుకుంది. సదాశివపేట మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ పిల్లల చదువు కోసం సదాశివపేట పట్టణంలో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు పెద్ద కూతురు శివాని హైదరాబాదులో బి ఫార్మసీ చేస్తూ గత రెండు నెలల క్రితం ఒక ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

అప్పటినుంచి ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అమ్మ ప్రతి రోజు బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయికి బెదిరిస్తున్నారని తండ్రితో పలుసార్లు చెప్పింది. అదే మనస్తవంతో ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పక్క రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న అని అమ్మాయి తండ్రి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి నా చావుకు ఎవరు కారణం కాదంటూ ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న సదాశివ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223699

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: