Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పొత్తు లో కీలక పరిణామం

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పొత్తు లో కీలక పరిణామం

by Satya
TDP and BJP

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో చర్చలు జరిపిన అమిత్ షా, బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని ఆదేశించారు. ఈ మేరకు సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బీజేపీ అధినాయత్వం 20 అసెంబ్లీ స్థానాలతో ఓ జాబితాను రూపొందించింది. ఉమ్మడి కర్నూలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది. తూర్పు గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 1, పశ్చిమ గోదావరిలో 3 సీట్లను ఆ పార్టీ కొరుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ.. హైకమాండ్‌కు ఏపీ బీజేపీ రిపోర్టును పంపింది.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.
    త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…
  • అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.
    అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు. ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సాధించిన అభివృద్ధిని…
  • చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
    తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: