రంగారెడ్ది జిల్లా(Rangareddy District), చేవెళ్ల నియోజకవర్గం
మొయినాబాద్ మండల కేంద్రంలోని హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ విజయ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్ మొయినాబాద్ మండల గ్రామ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ నేపథ్యంలో కొండా(Konda Visveshwar Reddy) మాట్లాడుతూ….
అంబేద్కర్ ఆశయాలను నిలబెడతాం, అంబేద్కర్ సిద్ధాంతాలకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉంటుంది. డాక్టర్ అంబేద్కరు గారిని, మరియు దళితులను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ కలబొల్లి మాటలు చెబుతుంది. ప్రజలందరికీ తాను ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలందరి సమస్యను పరిష్కరిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలకు పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమ పథకాలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కెసిఆర్ తెలంగాణ ప్రజలను నిలువు నా మోసం చేశారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ విజయం ఖాయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ కి దేశంలో రాజకీయంగా ఎదురులేదని ఆయన మూడోసారి ప్రధాని ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ ఇన్చార్జ్ కేఎస్ రత్నం, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చేవెళ్ల గడ్డపై బీజేపీ విజయం ఖాయం- కొండా విశ్వేశ్వర్ రెడ్డి