Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh దొంగ ఓట్లపై సీఈసీ కి ఫిర్యాదు…

దొంగ ఓట్లపై సీఈసీ కి ఫిర్యాదు…

by Prakash
Pawan Kalyan and Chandrababu met the CEC team

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే పరిస్థితి నెలకొందని, చరిత్రలో ఎక్కడా జరగని అక్రమాలు ఏపీలో జరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ బృందాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, చంద్రబాబు కలిశారు. అన్ని విషయాలను కమిషన్‌కు వివరించామన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని, ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీ కి ఫిర్యాదు చేశామన్నారు. మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారని, టీడీపీ – జనసేనపై 7 వేల అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. అయితే ఎన్నికల విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కామని ఎలక్షన్ కమిషన్ మాట ఇచ్చిందన్నారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తామిచ్చిన ఫిర్యాదులపై కొన్ని చర్యలు తీసుకున్నామని కమిటీ చెప్పిందన్నారు. ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని.. 1/4 దొంగ ఓట్లు చేర్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు. రెండు నెలల‌ ముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని కమిటీ తెలిపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: