బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) బస్సు యాత్ర(Bus Yatra)కు సర్వం సిద్ధం చేశారు. రేపటి నుంచి మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనున్నది. 17 రోజుల పాటు 12 లోక్ సబ స్థానాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ యాత్ర కొనసాగించనున్న బస్సుకు తెలంగాణ భవన్ లో గులాబీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విదంగా బస్సు యాత్రకు ప్లాన్ చేశారు.
ఇది చదవండి: అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు..!
రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయల్దేరి మిర్యాలగూడ చేరుకొని.. అక్కడి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మే 10వ తేదీన సిద్ధిపేటలో బస్సు యాత్ర ముగియనున్నది. బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగు నీరు, రైతులకు రైతు బంధు, పంటలకు బోన్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
- కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన.కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పలు అంశాలపై స్పందించారు. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్ యాజమాన్యం బలవంతంగా “కల్మా, సూరహ్ ఫతే” చదవాలని ఆదేశించడం దుర్మార్గమని ఆరోపించారు. ఇది హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై దాడిగా అభివర్ణిస్తూ దీనిని…
- ఇవాల్టి నుంచి తెలంగాణలో బోనాల జాతర.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగ. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనమెత్తుకొని ఆలయాలకు తరలివెళతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని ప్రతిబంబించే బోనాల ఉత్సవాలు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి



Total views : 212335