కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉరకలు వేస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 36 గేట్ల ద్వారా.. 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.63 టీఎంసీల నీటి మట్టం ఉండగా.. 9.65 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వకు గాను.. 7.89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఎగువ నుంచి ప్రాజెక్టుకు వస్తున్న వరద పై గంట గంటకు సమీక్ష నిర్వహిస్తున్న అధికారులు గేట్లను పైకి ఎత్తడం, తగ్గించడం చేస్తున్నారు. మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ . ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకు పోయినప్పటి నుంచి అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ.. దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
- కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‌రావు.తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై ఆధారాలతో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్…
- ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట.ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఇందుకోసం రవికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి