Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh మైక్రో సాఫ్ట్ సిఇఓతో మంత్రి నారా లోకేష్ భేటీ

మైక్రో సాఫ్ట్ సిఇఓతో మంత్రి నారా లోకేష్ భేటీ

by Rama
మైక్రో సాఫ్ట్ సిఇఓతో మంత్రి నారా లోకేష్ భేటీ!

ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేశ్‌ తో ఫోటోలు దిగారు. ఏపీకి చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఏపీలో ఐఏఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేశారు. కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ లో మంచి ప‌రిజ్ఞానం కలిగిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. లోకేశ్‌తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని అన్నారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ డాల‌ర్ల‌ మార్కెట్ క్యాప్ కలిగి ఉండి, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉంద‌న్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్‌ రంగంలో బలమైన వృద్ధితో 211.9 బిలియన్ డాల‌ర్ల‌ ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.

మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుంద‌ని, ప్రస్తుతం 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నార‌ని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా స‌త్య నాదేళ్ల‌ను కోరారు. ఏపీలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృంద సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023339
Total views : 141781

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.